తెలంగాణ రాజకీయాల్లో సర్వేల టెన్షన్

Telangana: ఎమ్మెల్యేల పనితీరుపై గులాబీ బాస్ సర్వే

Update: 2022-06-26 01:07 GMT

తెలంగాణ రాజకీయాల్లో సర్వేల టెన్షన్

Telangana: తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో తమదంటే తమదే అధికారం అంటూ స్పీచ్‌లు ఇస్తున్నారు. దీనితో పాటు టీఆర్ఎస్ అధినేత ఇప్పటికే పీకేతో సర్వే చేయిస్తున్నారు. ఈ సర్వేలో ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్‌‌కు రిపోర్ట్ ఇచ్చారు పీకే. ఎప్పుడూ వారి వారి వ్యాపారాలపై దృష్టి పెట్టే ఎమ్మెల్యేలు.. ఇప్పుడు తమ ఫోకస్ అంతా రాజకీయాలపై పెట్టారంటూ టీఆర్ఎస్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఇక మంత్రులు జిల్లాల వారీగా సర్వేలు చేయిస్తున్నారట. ఆ సర్వే రిపోర్ట్‌ని కొంత మంది మంత్రులు వారికి దగ్గరగా ఉండే ఎమ్మెల్యేలకు ఇస్తూ నియోజకవర్గంలో మార్పు దిశగా ప్రజల వద్దకు వెళ్లాలని సూచించినట్లు సమాచారం. అయితే ఇదే సమయంలో ఇతర పార్టీల నేతలు కూడా సర్వేలపై దృష్టి పెట్టారు. గ్రామాల్లో ప్రజల సమస్యల ఆధారంగా సర్వేలు చేస్తూ... అధికార పార్టీకి ఏ నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందన్న దానిపై ఫోకస్ పెట్టారు. ఆ ప్రాంతంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అధికార పార్టీ వ్యతిరేకతపై దృష్టి పెడుతున్నారట. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు కొన్ని నియోజవర్గాల్లో పార్టీకి అనుకూలంగా ఉన్న నియోజవర్గంపై ఫోకస్ చేయలన్న దానిపై నిత్యం ఇంటర్నల్ సమావేశాలు పెట్టుకుంటున్నారు.

పీకే ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అప్రమత్తం అవుతుంటే... ఇతర పార్టీల నేతలు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను ప్రతిపక్షాల వైపు తిప్పుకునేలా ప్లాన్ చేస్తున్నారట. మొత్తంగా రాజకీయ పార్టీలు సర్వేల ఆధారంగా ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమయ్యారనే టాక్ విన్పిస్తోంది. 

Tags:    

Similar News