ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ఘర్షణ
ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వివాదం జరిగింగి.
ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ఘర్షణ
ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వివాదం జరిగింగి. పదవులు లేని వారిని స్టేజిపై కూర్చోబెట్టారని.. కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పదవులు లేని వారి పేర్లు ప్రసంగంలో తీసుకోవటంతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
ఈ క్రమంలో రెండు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాట మాట పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు ఇరువర్గాల నేతలు. జోక్యం చేసుకున్న పోలీసులు... నేతలకు సర్దిచెప్పి పంపారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో పరస్పరం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులు చేశారు.