Bathukamma Sarees : చీరలు నచ్చకుంటే వెళ్లిపోండి.. మహిళలపై ఎంపీపీ ఆగ్రహం
*సంకిరెడ్డిపల్లిలో మహిళలపై ఎంపీపీ మౌనిక అనుచిత వ్యాఖ్యలు *చీరలు నాసిరకంగా ఉన్నాయని మంచి చీరలు ఇవ్వాలన్న మహిళలు
Bathukamma Sarees : చీరలు నచ్చకుంటే వెళ్లిపోండి.. మహిళలపై ఎంపీపీ ఆగ్రహం
Batukamma Sarees: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లిలో ఎంపీపీ మౌనిక మహిళలను అవమానపరిచారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీలో స్థానిక ఎంపీపీ పాల్గొన్నారు. అయితే చీరలను పంపిణీ చేసే క్రమంలో ఎంపీపీని మహిళలు నిలదీశారు. చీరలు నాసిరకంగా ఉన్నాయని మంచి చీరలు ఇవ్వాలంటూ అక్కడి మహిళలు కోరారు.
దీంతో అసహనానికి గురైన ఎంపీపీ ఇచ్చేది ఇవే చీరలు మీకు ఇష్టం ఉంటే తీసుకోండి లేదంటే వెళ్లిపోండని అనడంతో మహిళలు చీరలు తీసుకోకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇక వారిని శాంతింపచేయాల్సిందిపోయి చీరలు అవసరం లేకపోతే పెన్షన్లు కూడా ఆపండి అంటూ అధికారులను ఆదేశించారు మరో అధికారి. ఆర్ఐ ఈ చీరలు తీసుకెళ్లండంటూ ఎవరు అడిగినా ఇవ్వొద్దంటూ ఆదేశించారు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళలు అక్కడి నుంచి కోపంతో వెనుదిరిగారు.