రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె : తాత్కాలికంగా 3 వేల మంది డ్రైవర్ల నియామకం

Update: 2019-10-04 16:03 GMT

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ మొదలైంది. రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పలు దూర ప్రాంత బస్సులు రద్దు చేశారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. 2100 అద్దె బస్సులు సిద్ధం చేశారు. అలాగే 20 వేల స్కూల్ బస్సులు వినియోగంలోకి తీసుకురానున్నారు. ప్రతీ ఒక్క ప్రైవేటు వాహనానికి అనుమతి మంజూరు చేసినందుకు రోజుకు 100 రూపాయలు చొప్పున ప్రభుత్వానికి చెల్లించాలి. తాత్కాలికంగా 3 వేల మంది డ్రైవర్ల నియామకం చేపట్టారు. ప్రతీ జిల్లాలో డ్యూటీ చేసే కార్మికులకు భద్రత కల్పించాలని ఆదేశించారు. 

Tags:    

Similar News