Operation Sindoor: ‘ఆపరేషన్ కగార్‌’కు తాత్కాలిక బ్రేక్.. కేంద్రం సంచలన ఆదేశాలు

Operation Sindoor: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఆపరేషన్‌ కగార్‌పై సింధూర్‌ ఎఫెక్ట్ పడ్డది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఆర్మీ బలగాలు కర్రెగుట్టలో చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌కు తాత్కాలిక బ్రేక్ పడింది.

Update: 2025-05-10 05:43 GMT

Operation Sindoor: ‘ఆపరేషన్ కగార్‌’కు తాత్కాలిక బ్రేక్.. కేంద్రం సంచలన ఆదేశాలు

Operation Sindoor: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఆపరేషన్‌ కగార్‌పై సింధూర్‌ ఎఫెక్ట్ పడ్డది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఆర్మీ బలగాలు కర్రెగుట్టలో చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌కు తాత్కాలిక బ్రేక్ పడింది. కర్రెగుట్టను జల్లెడ పడుతున్న CRPF బలగాలను కేంద్రం వెనక్కి రప్పిస్తోంది. సుమారు 5వేల మందికి పైగా బలగాలను కేంద్రం వెనక్కి రప్పిస్తుంది.

తెలంగాణ సరిహద్దులోని హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని CRPF కోబ్రా జవాన్లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భారత్-పాక్ వార్ నేపథ్యంలో కర్రెగుట్టల నుండి బలగాలు వెనక్కి వెళ్తున్నాయి. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి రేపు ఉదయంలోపు భారత్- పాక్ సరిహద్దుల్లోకి సీఆర్‌పీఎఫ్ బలగాలు వెళ్లనున్నాయి. CRPF బలగాలు వెనక్కి వెళ్తుండడంతో ఏజెన్సీ గ్రామాలు రిలాక్స్ అయ్యాయి.

Tags:    

Similar News