ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా

అడవుల జిల్లా ఆదిలాబాద్ ను చలి గజగజ వణికిస్తోంది.. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జిల్లావ్యాప్తంగా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం కలవరానికి గురిచేస్తోంది... దీంతో చలి తీవ్రతకు జనం విలవిల్లాడిపోతున్నారు..

Update: 2020-12-23 09:10 GMT

 అడవుల జిల్లా ఆదిలాబాద్ ను చలి గజగజ వణికిస్తోంది.. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జిల్లావ్యాప్తంగా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం కలవరానికి గురిచేస్తోంది... దీంతో చలి తీవ్రతకు జనం విలవిల్లాడిపోతున్నారు.. జిల్లాలోని ఆర్లి గ్రామంలో గత నాలుగైదు రోజులుగా 3.6 ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు ... దీంతో బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు...

 ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది... వారం రోజులుగా జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పడి పోవడంతో చలి తీవ్రత పెరిగిపోతోంది....ప్రధానంగా భీంపూర్‌ మండలం అర్లి(టి)లో 3.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలునమోదవడం చలి తీవ్రతకు అద్దం పడుతోంది....అదేవిధంగా తాంసిలో 5.6, తలమడుగు మండలం కోసాయిలో 6.7 బేల మండలంలో 5.0 డిగ్రీలు, జైనథ్‌లో 5.6, డిగ్రీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి....

 గతేడు డిసెంబరుతో పోల్చుకుంటే ఈ యేడు డిసెంబర్‌ 22 నాటికి ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోవడంతోనే చలి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఈ నెల చివరి వరకు మరింత చలి ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. అటు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో మరింత చలి తీవ్రత కనిపిస్తోంది. వారం రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోవడంతో వ్యవసాయ పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి..ఉదయాన్నే లేచి పంట చేన్లలోకి వెళ్లే రైతులు 11గంటల వరకు వెళ్లే పరిస్థితులు కనిపిం చడం లేదు....దీంతో వ్యవసాయ పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు...

 జిల్లాలో వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పడి పోవడంతో చలి తీవ్రత పెరిగిపోతోంది. సాయంత్రం 5గంటలకే చల్లటి ఈదురు గాలులతో ప్రజలు ఇబ్బం దులకు గురవుతున్నారు. సాయంత్రం వేళల్లో త్వరగానే పనులను ముగించుకొని ఇంటికే పరిమితమవుతున్నారు...ఉదయం 10గంటల వరకు జనం బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రధానంగా మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు, పాల వ్యాపారులు,మార్నింగ్‌వాక్‌ చేస్తున్న వారంత చలి తీవ్రతతో ఇబ్బందులకు గురవుతున్నారు.... చలి కారణంగా వృద్దులు పిల్లలు ఆస్తమా పేషేంట్లు ఇబ్బందులు పడుతున్నారు... మొత్తానికి వరం రోజులుగా జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు... 

Tags:    

Similar News