హాస్య నటుడు వేణుమాధవ్‌ ఇకలేరు

ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్‌ సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గతకొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 6న సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చేరారు.

Update: 2019-09-25 07:12 GMT

ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్‌ సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గతకొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 6న సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చేరారు.  గత కొద్ది రోజుల నుంచి ఆయనకు డయాలసిస్‌ నడుస్తోంది. మంగళవారం ఆరోగ్యం విషమించడంతో ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఈ మధ్యాహ్నం కన్నుమూశారు.

వేణుమాధవ్‌ స్వస్థలం సూర్యాపేట జిల్లా కోదాడ. 1979 డిసెంబర్‌ 30న సాధారణ కుటుంబంలో జన్మించారు. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా, హాస్య నటుడిగా, కథానాయకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. బుల్లితెరపై పోపులపెట్టె ధారావాహిక ద్వారా పరిచయమయ్యారు. నెమ్మదిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. చిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. తొలిసారిగా 1996లో ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో కృష్ణా హీరోగా నటించిన సంప్రదాయం చిత్రంలో నటించారు. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌ హోరగా నటించిన తొలిప్రేమ.. వేణుమాధవ్‌కు మంచి గుర్తింపునిచ్చింది.

వేణుమాధవ్‌.. తనని సిల్వర్‌ స్కీన్‌కి పరిచయం చేసిన దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి ద్వారానే హీరోగా నటించాడు. ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన హంగామా సినిమాతో హీరో అయ్యాడు. ఓవైపు నటిస్తూనే.. భూకైలాస్, ప్రేమాభిషేకం వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. సంప్రదాయం మొదలు, తొలిప్రేమ, తమ్ముడు, యువరాజు, ప్రియమైన నీకు, లాహిరి లాహిరి లాహిరిలో, దిల్‌, సై, ఛత్రపతి, సింహాద్రి, వెంకీ, లక్ష్మీ, బన్నీ, పోకిరి, అన్నవరం, ఆటోనగర్‌ సూర్య తదితర చిత్రాల్లో హాస్యనటుడిగా నవ్వులు పండించాడు.

Tags:    

Similar News