Rain Alert: తీవ్ర అల్పపీడనం ప్రభావం..తెలంగాణలో మోస్తరు వర్షాల అలర్ట్

దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా, తదుపరి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Update: 2025-11-24 03:50 GMT

Rain Alert: తీవ్ర అల్పపీడనం ప్రభావం..తెలంగాణలో మోస్తరు వర్షాల అలర్ట్

దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా, తదుపరి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. నవంబర్ 26 నుంచి 28 వరకు ఉత్తరాంధ్ర, తూర్పు తెలంగాణలో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అంచనా.


బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు

వాతావరణశాఖ హెచ్చరికలు విడుదల

దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం… ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది.

ఈ తీవ్ర అల్పపీడనం నేడు (నవంబర్ 24) మధ్యాహ్నానికి ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆపై 48 గంటల్లో మరింత బలపడి శక్తివంతమైన తుపానుగా మారవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ వ్యవస్థ తుపానుగా మారినట్లయితే… దీనికి ఐఎండీ నిర్ణయించిన పేరును పెట్టే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

Tags:    

Similar News