TS EDCET 2020: తెలంగాణ ఎడ్‌సెట్ 2020 నోటిఫికేషన్ విడుదల...

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TS EDCET 2020 నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

Update: 2020-02-25 10:20 GMT

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TS EDCET 2020 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. తెలంగాణ ఎడ్‌సెట్ నిర్వహిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 24న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 27వ తేదినుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్-BEd కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు ముందుగా తెలంగాణ ఎడ్‌సెట్ పరీక్ష రాయవలసి ఉంటుంది.

ఇక పోతే ఈ పరీక్షను మే 23, 2020, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరడానికి అవకాశం లభిస్తుంది. ఈ అర్హత పరీక్షను బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్ పాసైనవారు కూడా రాయవచ్చును. పూర్తివివరాల్ కోసం https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చును.

ఇక పోతే ఫిబ్రవరి 24 వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 27వ తేదీన దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 20వ తేదీన దరఖాస్తులకు చివరి తేది. రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీగా 2020 ఏప్రిల్ 25న ముగియనున్నాయి. రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీగా 2020 ఏప్రిల్ 30వ తేదీన ముగియనున్నాయి. రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీగా 2020 మే 4న ముగియనున్నాయి.

ఇక పోతే మే 15 వ తేదీ నుంచి హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. మే 23వ తేదిన టీఎస్ ఎడ్‌సెట్ పరీక్షను నిర్వహించనున్నారు. మే 27 తేదీన ప్రిలిమినరీ కీ విడుదల చేయనున్నారు. మే 27 నుంచి మే 30వ తేదీ వరకు ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. జూన్ 11వ తేదీన ర్యాంకులను వెల్లడించనున్నారు.

విద్యార్హత:

♦ ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

♦ బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్ పాసైనవారికీ అవకాశం.

♦ సైన్స్, మ్యాథ్స్ స్పెషలైజేషన్‌తో బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

♦ 2020 జూలై 1 నాటికి కనీసం 19 ఏళ్లు.

దరఖాస్తు ఫీజు

♦ జనరల్ విద్యార్థులకు రూ.650.

♦ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.450.

టీఎస్ ఎడ్‌సెట్ 2020 డీటెయిల్డ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News