సిజేరియన్ ఆపరేషన్లలో తెలంగాణా మూడోస్థానంలో!

Update: 2020-10-02 06:31 GMT

బేబిని ప్రసవించడమంటే.. స్త్రీకి మరో జన్మలాంటిది. కానీ దురదృష్టం ఎంటంటే డెలివరీ అనగానే ఈ జనరేషన్ మహిళలు భయానికి లోనవుతున్నారు. ఏం జరుగుతుందో అన్న అపోహతో సిజేరియన్ బెటర్ ఆప్షన్ గా ఫీలవుతున్నారు. మూహూర్తం అంటూ ఒకరు, భయంతో ఇంకొకరు. అందం ఏమవుతుందో అని మరొకరు ఇలా ఎంతో మంది మాతృమూర్తులు కడుపును కోసుకోవడానికే మొగ్గుచూపుతున్నారు. ఇటు వైద్యులు కూడా అవసరం ఉన్నా లేకున్నా కడుపులు కోసి తమ గల్లాపెట్టే నిప్పుకుంటున్నారు. దీంతో సిజేరియన్ ఆపరేషన్ లో తెలంగాణ దూసుకెళ్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పెరిగిన సిజేరియన్ ఆపరేషన్లపై హెచ్ ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

రాష్ట్రంలో నార్మల్ డెలివరీల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోంది. సిజేరియన్ ఆపరేషన్లలో తెలంగాణ మూడోస్థానానికి చేరుకుందని ఓ సర్వే స్పష్టం చేసింది. సీ సెక్షన్స్ తగ్గించాలని ప్రభుత్వం కేసీఆర్ కిట్ల వంటి పథకాలు అమలు చేస్తున్నా ప్రయోజనం శూన్యం. లాక్‌డౌన్‌ సమయంలో తెలంగాణలో రోజుకు 740 సిజేరియన్‌ ఆపరేషన్లు జరిగాయి. అంటే మూడు నెలల్లో 66వేల 6వందల 61 సిజేరియన్లు జరిగాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 85వేల 3వందల 23, తమిళనాడులో 78వేల 9వందల 82 ఆపరేషన్స్‌ జరిగినట్లు కేంద్రం వెల్లడించింది.

తెలంగాణలో 2019 జనవరి 1 నుంచి మార్చి 5 వరకు 74వేల 5వందల 58 మంది జన్మిస్తే అందులో సాధారణ ప్రసవాలు 30,030 మాత్రమే. ప్రతి రోజు సగటున 1,165 ప్రసవాలు జరిగితే, సగటున గంటకు ౪౮ మంది జన్మించారు. అంటే గంటకు సగటున 28 కడుపు కోతలు జరుగుతున్నాయి. ఏ నొప్పి వచ్చినా ఆపరేషనే తారక మంత్రంగా ప్రైవేట్ హాస్పిటళ్లు వ్యవహరిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ధనార్జనే ధ్యేయంగా అవసరం ఉన్నా లేకున్నా లేనిపోని భయాలు సృష్టించి, ఆపరేషన్స్ చేసేస్తున్నారు. బిడ్డ అడ్డం తిరిగిందని, బిడ్డ కదలడం లేదంటూ మాయమాటలు చెప్పి, ఆపరేషన్స్ కు ఉసిగొల్పుతున్నారు. దీంతో అప్పులు చేసైనా ఆపరేషన్స్ చేపిస్తున్నారు పేదలు.

ఇష్టారీతిన సిజేరియన్ ఆపరేషన్లు చేయడం వల్ల మహిళలకు భవిష్యత్ లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులే చెబుతున్నారు. మళ్లీ వాళ్లే కత్తులు పట్టుకొని రెడీ అవుతున్నారు. నార్మల్ డెలివరీ అయ్యే చాన్స్ ఉన్నా ముహూర్తం చూసుకొని మరీ పలనా టైంకి ఆపరేషన్ చేయాలంటూ కోరుతున్నారు. తొమ్మిది నెలలు నిండకున్నా మూహూర్తం మంచిగా ఉందని కడుపును కోసేస్తున్నారు. అయితే పండితులు ఈ వ్యవహారాన్ని తప్పుబడుతున్నారు. సహజంగా పుట్టిన సమయాన్ని బట్టి జాతక చక్రం ఉంటుంది కానీ ముహూర్తం సమయంలో ఇలా ఆపరేషన్లు చేయడం సరైన పద్ధతి కాదంటున్నారు.

Tags:    

Similar News