Khammam: ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య
Khammam: పరారీలో నిందితుడు వెంకటేశ్వర్లు
Khammam: ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య
Khammam: ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య చేశాడు. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన తల్లి పిచ్చెమ్మతో పాటు ఇద్దరు కూతుళ్లు నీరజ, ఝాన్సీని తన ఇంట్లోనే దారుణంగా నరికి చంపాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, ఆర్థిక ఇబ్బందులతోనే హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేశ్వర్లు కోసం పోలీసులు గాలిస్తున్నారు.