Jagtial: బ్రిడ్జిపై ప్రమాదం.. పాల వాహనం, లారీ ఢీకొని ఒకరు మృతి
Jagtial:కరీంనగర్ నుంచి జగిత్యాలకు వెళ్తుండగా ఘటన
Jagtial: బ్రిడ్జిపై ప్రమాదం.. పాల వాహనం, లారీ ఢీకొని ఒకరు మృతి
Jagtial: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ బ్రిడ్జిపై ప్రమాదం జరిగింది. పాల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బొలెరోని మరొకరికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స కోసం సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. కరీంనగర్ నుంచి జగిత్యాలకు పాలప్యాకెట్ల లోడుతో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే బొలెరో వాహనంలోని పాల ప్యాకెట్లన్నీ రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు వాటిని తీసుకునేందుకు ఎగబడ్డారు.