Busireddy Panduranga Reddy: నాగార్జునసాగర్‌లో బుసిరెడ్డి ఫౌండేషన్ సేవలు
Busireddy Panduranga Reddy: నాగార్జునసాగర్‌లో బుసిరెడ్డి ఫౌండేషన్ ద్వారా రైతులకు డ్రోన్ సేవలు, అన్నదానం, విద్యార్థులకు సహాయం, సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి.
Busireddy Panduranga Reddy: నాగార్జునసాగర్‌లో బుసిరెడ్డి ఫౌండేషన్ సేవలు
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్:
సమాజంలో సంపాదించే వారు చాలామంది ఉన్నప్పటికీ, సంపాదించిన దానిలో కొంత భాగాన్ని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వెచ్చించే వారు మాత్రం అరుదుగా ఉంటారు. ఆ అరుదైన వ్యక్తుల్లో బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఒకరు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో గుర్తింపు పొందిన ఆయన, తన సొంత నియోజకవర్గమైన నాగార్జునసాగర్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
2023లో “బుసిరెడ్డి ఫౌండేషన్”ను స్థాపించిన పాండురంగారెడ్డి, పదవులు లేదా ఓట్ల రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను అందించేందుకు డ్రోన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. 2,500 మంది రైతులకు ఉచితంగా ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయించారు. యూరియా కొరత సమయంలో డ్రోన్ల ద్వారా నానో యూరియా స్ప్రే చేయించి పంటలను రక్షించారు. అదనంగా 1,550 మంది రైతులకు జింక్ బ్యాగులు, 9,500 మంది వ్యవసాయ కార్మికులకు టిఫిన్ బ్యాగులు పంపిణీ చేశారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా 1,500 కుటుంబాలకు అంత్యక్రియల అనంతరం భోజన ఏర్పాట్లు చేశారు. లక్షా 50 వేల మందికి అన్నదానం నిర్వహించారు. 8 వేల మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, 300 మంది వీధి వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు. 100కు పైగా దేవాలయాలకు లక్ష రూపాయల చొప్పున విరాళాలు అందించారు. 430 వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. 32 వేల కుటుంబాలకు మామిడి మొక్కలు, జూట్ సంచులు అందజేశారు. గ్రామాల్లో నీటి సమస్య నివారణకు సొంత ఖర్చుతో బోర్‌వెల్స్ త్రవ్వించారు.
సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బుసిరెడ్డి పాండురంగారెడ్డి కార్యక్రమాలకు స్థానిక ప్రజలు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.