Heavy Rains: Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
Heavy Rains: డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోడ్లపై నిలిచిపోయిన వర్షపునీరు
Heavy Rains: Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షం దంచి కొట్టింది. హైదరాబాద్ సిటీ సహా మహబూబ్ నగర్, వికారాబాద్, వరంగల్, తదితర జిల్లాల్లో బారీ వర్షం పడింది. హైదరాబాద్ నగర శివారులోని కొత్తపేట, నాగోల్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నాగోల్ అయ్యప్ప నగర్ కాలనీలో ఇండ్లలోకి వరద నీరు చేరింది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
వనస్థలిపురం చింతలకుంట వద్ద విజయవాడ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వికారాబాద్ నియోజకవర్గంలో రెండు రోజులుగా పలుచోట్ల మోస్తారు వర్షం కురుస్తుంది. జడ్చర్లలో అరగంటపాటు భారీ వర్షం కురిసింది. రోడ్లు చెరువులను తలపించాయి. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి డ్రైనేజీలు నిండి రోడ్లపై మురుగునీరు ప్రవహించాయి. ఇక అనంతపురం జిల్లా గుత్తి మండల వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన కుండ పోత వర్షం కురిసింది. దాదాపు మూడు గంటల పాటు భారీ వర్షం కురవడంతో అధికారులు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు.