Malla Reddy: కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా
Malla Reddy: రెండున్నర ఎకరాల భూమి తనదేనంటున్న మల్లారెడ్డి
Malla Reddy:
Malla Reddy: హైదరాబాద్ సుచిత్రలో భూవివాదం వెలుగులోకి వచ్చింది. మాజీమంత్రి మల్లారెడ్డి, మరో వర్గం మధ్య భూ వివాదం తలెత్తింది. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో రెండున్నర ఎకరాల భూమి తనదేనంటున్నారు మల్లారెడ్డి. ఇదిలా ఉంటే.. 1.11 ఎకరాల భూమి తమదంటూ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డితో మరో వర్గం వాగ్వాదానికి దిగింది. ఒక్కొక్కరం గతంలో 400 గజాల చొప్పున కొనుగోలు చేశామని 15 మంది వాదిస్తున్నారు. తమకు అనుకూలంగా కోర్టు కూడా తీర్పు ఇచ్చిందని చెప్పారు.
అయితే.. మల్లారెడ్డి అనుచరులు తమను బెదరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కోర్టు ఆర్డర్ ఉన్న నేపథ్యంలో ఘటనాస్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దంటూ ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనాస్థలంలోనే పోలీసుల మకాం వేశారు. తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.