నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
Telangana: రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
Telangana: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తైంది. దీనికి సంబంధించి పునర్విభజన చట్టాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. వీటితోపాటు ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని సీఎం హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా నిధులు సమీకరణపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించి, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించనున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినేట్‌లో చర్చించనున్నారు.
జూన్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్కూల్, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలను చర్చించనున్నారు. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా చర్చించి నిర్ణయం తీసుకొనున్నారు.