Telangana SSC 2025 results: తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదలకు టైమ్ ఫిక్స్
Telangana SSC 2025 results: తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదలకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది.
Telangana SSC 2025 results: తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదలకు సర్వం సిద్ధం
Telangana 10th Class 2025 results date and time
తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాల వెల్లడించేందుకు తేదీ, సమయం ఖరారైంది. ఏప్రిల్ 30న, అంటే రేపు బుధవారం మధ్యాహ్నం 1 గంటకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. తాజాగా పాఠశాల విద్య శాఖ ఆ వివరాలను ప్రకటించింది.
ఎందుకు ఆలస్యమైందంటే...
గత ఏడాది వరకు పదో తరగతి ఫలితాలను సబ్జెక్టుల వారీగా మార్కులను వెల్లడించకుండా గ్రేడ్స్ కేటాయించేవారు. అన్ సబ్జెక్టులు కలిపి క్యూములేటివ్ గ్రేడ్స్ ఇచ్చేవారు. కానీ ఈ ఏడాది నుండి పదో తరగతి మార్కుల మెమోపై సబ్జెక్టుల వారీగా మార్కులు కూడా చూపించనున్నారు. మార్కుల మెమొలో ఈ మార్పుల కారణంగానే పదో తరగతి ఫలితాలు వెల్లడించడంలో కొంత ఆలస్యమైంది. ఎందుకంటే, గ్రేడ్స్‌తో పాటు మార్కులు కూడా ముద్రించే పద్ధతికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ పాఠశాల విద్యా శాఖ ఏప్రిల్ 8న ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టింది. ఆ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించడానికి 20 రోజులు పట్టింది. ఈ కారణంగానే పాఠశాల విద్యా శాఖ అధికారులు ప్రభుత్వం నుండి స్పందన కోసం ఇప్పటివరకు వేచిచూడాల్సి వచ్చింది.
గత కొన్నేళ్లుగా తెలంగాణలో 10వ తరగతి పాస్ పర్సెంటేజ్ ఎలా ఉందంటే...
2024: 91.31 %
2023- 86.6 %
2022- 90 %
2021- 100 %
2020- 100 %
2019- 92.43 %
2018- 83.78 %
ఈసారి పదో తరగతి పరీక్షలు మార్చి 21వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఈసారి పాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది, ఎవరిది పై చేయి అవుతుందనేది తెలియాలంటే రేపు టెన్త్ క్లాస్ ఫలితాలు వెల్లడించే వరకు వెయిట్ చేయాల్సిందే. రిజల్ట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/ లోకి లాగాన్ అవ్వాల్సి ఉంటుంది.