తెలంగాణ సచివాలయ భవనాలు కూల్చివేతకు రంగం సిద్ధం

Update: 2019-08-24 15:32 GMT

తెలంగాణ సచివాలయ భవనాలు కూల్చివేతకు ఇంప్లోజన్‌ విధానం సరైనదని నిపుణులు నిర్ధారణకు వచ్చారు. ఈ విధానం ద్వారా భారీ చప్పుడు లేకుండా జిలెటిక్‌ స్టిక్స్‌ అమర్చి మొత్తం సచివాలయం బ్లాకులన్నింటినీ ఒకేసారి కూల్చివేయవచ్చని అధికారులు త్రీడీ వీడియో ద్వారా ముఖ్యమంత్రికి వివరించనున్నారు. 18 ఎకరాల విస్తీర్ణంలో 8 బ్లాక్ లతో సెక్రెటరియట్ బహుళ అంతస్తుల భవనాల కూల్చివేతపై అధ్యయనం చేసిన ఆర్ అండ్ బీ ఇంజనీరింగ్‌ నిపుణుల బృందం.. చివరకు ఇంప్లోజన్‌ విధానాన్ని మంచిదనే విషయం సిఎంకు వివరించనున్నారు. సిఎం ఆమోదం తెలిపిన వెంటనే కూల్చివేతలకు ముహూర్తం ఖరారు చేస్తారు.

Tags:    

Similar News