Telangana Rains: హైదరాబాద్‌లో ఒంటి పూట బడి, పలు జిల్లాల్లో గురువారం కూడా పాఠశాలలకు సెలవు
తెలంగాణలో వరుణుడు విరుచుకుపడుతూ పలు జిల్లాల్లో పరిస్థితి విషమం చేశాడు. బుధవారం, గురువారం రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న వెల్లడించారు.
Telangana Rains: హైదరాబాద్‌లో ఒంటి పూట బడి, పలు జిల్లాల్లో గురువారం కూడా పాఠశాలలకు సెలవు
తెలంగాణలో వరుణుడు విరుచుకుపడుతూ పలు జిల్లాల్లో పరిస్థితి విషమం చేశాడు. బుధవారం, గురువారం రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో 17న వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూసివేయాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అయితే గురువారం ఒంటి పూట బడులు మాత్రమే నిర్వహించి, విద్యార్థులను మధ్యాహ్నం ఇంటికి పంపాలని ఆదేశించారు.
అలర్ట్ జాబితా:
రెడ్ అలర్ట్: సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి
ఆరెంజ్ అలర్ట్: ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, కామారెడ్డి, సిద్దిపేట, హనుమకొండ, జనగామ, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి
ఎల్లో అలర్ట్: నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్
హైదరాబాద్‌లో ఇప్పటికే పలుచోట్ల కుండపోత వర్షం కురుస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ మందగించి, నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.