LockDown: లక్షా 80 వేల కేసులు నమోదు...

కరోనాను కంట్రోల్ చేయడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రజలకు బయటికి రాకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది.

Update: 2020-03-30 08:39 GMT
Representational Image

కరోనాను కంట్రోల్ చేయడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రజలకు బయటికి రాకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది. ఇంటి వద్దకే కురగాయలు, నిత్యావసర వస్తువులను పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రజలెవరూ అనవసరంగా బయటికి రావొద్దని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ లాక్ డౌన్ ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. అత్యవసర, నిత్యవసర వస్తువుల కోసం కాకుండా అవసరం లేకుండా ప్రజలు రోడ్లపైకి వస్తే కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. బయటికి రావొద్దంటూ ఎన్ని సార్లు చెప్పినా వినకపోవడంతో అనవసరంగా బయటికి వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు, తాట తీస్తున్నారు.

ఇక వైపు ప్రజలను బతిమాలుతూనే మరోవైను చెప్పినపుడు వినకపోవడంతో లాఠీలకు పని చెబుతున్నారు. అంతే కాక చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ కోణంలోనే ఇప్పటి వరకు లాక్ డౌన్ అమలైనప్పటి నుంచి ఏకంగా 20 వేల వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలపై 188 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించడం, ప్రజల జీవితాలకు, ఆరోగ్యానికి, భద్రతకు భంగం కలిగించినప్పడు ఈ సెక్షన్ ను ఉపయోగిస్తారని పోలీసులు తెలుపుతున్నారు. అదే విధంగా రాష్ట్రంలో మొత్తంలో 1 లక్షా 80 వేల కేసులు నమోదు చేశారు. ఇక పోతే ఈ కేసులు ఎక్కువగా హైదరాబాద్ నగరంలోనే నమోదయ్యాయి. ఇందులో ఈ నెల 24న ఒక్క సైబరాబాద్ కమిషనరేట్‌లోనే 20 వేలకు పైగా కేసులు నమోదయితే, మిగతా కమిషనరేట్లలో 80 వేల వరకు కేసులు నమోదయ్యాయని అదికారులు తెలిపారు.


Tags:    

Similar News