Police Combing In Kadamba Forest : ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల కోసం డ్రోన్ కెమెరాల‌తో జ‌ల్లెడ‌

Update: 2020-09-22 06:51 GMT

Police Combing In Kadamba Forest : గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని అడవుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. పొరుగున ఉన్న ఆసిఫాబాద్‌కొమురంభీం జిల్లా కదంబా ఎదురుకాల్పుల్లో ఈనెల 19న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మావోల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. కాగజ్ నగర్ మండలం కడంబ ఎన్ కౌంటర్ సంఘటన తరువాత మావోయిస్టు రాష్ర్ట క‌మిటీ స‌భ్యుడు అడెల్లు అలియాస్ భాస్కర్ ల‌క్ష్యంగా పోలీసుల మూడో రోజులుగా కూంబింగ్ కొన‌సాగిస్తూ, అడ‌విని జ‌ల్లెడ ప‌డుతున్నారు.

డ్రోన్ కెమెరాల సాయంతో అడవుల్లో తప్పించుకున్న మావోయిస్టుల ఆచూకీని క‌నుగొనేందుకు పోలీసులు య‌త్నిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాలు, దట్టమైన అడవులను డ్రోన్ లతో గ్రేహౌండ్స్ బలగాలు, పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ డ్రోన్ ఆపరేషన్ ను స్వయంగా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు అడేల్లు అలియాస్ భాస్కర్ టార్గెట్‌గా ఈ కూంబింగ్ ను అధికారులు కొనసాగిస్తున్నారు. పెంచ‌క‌ల్‌పేట మండ‌లం సిద్దేశ్వ‌ర‌గుట్ట, లోడ్పేల్లి, చింత‌మ‌నేప‌ల్లి గూడెం, ప్రాణహిత న‌ది స‌రిహ‌ద్దు ప‌రివాహ‌క ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహ‌రించారు. రెండు రోజులుగా తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో పోలీసులు కూంబింగ్‌ కొనసాగుతోంది.

Tags:    

Similar News