Ande Sri: అందెశ్రీ గుండెపోటుతో మరణించారు: డాక్టర్‌ సునీల్‌ కుమార్‌

Ande Sri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ సోమవారం ఉదయం గుండెపోటుతో (Heart Attack) మరణించినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

Update: 2025-11-10 07:27 GMT

Ande Sri: అందెశ్రీ గుండెపోటుతో మరణించారు: డాక్టర్‌ సునీల్‌ కుమార్‌

Ande Sri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ సోమవారం ఉదయం గుండెపోటుతో (Heart Attack) మరణించినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

వైద్యులు సునీల్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం:

అందెశ్రీని సోమవారం ఉదయం 7:20 గంటలకు ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించి 5 నుంచి 6 గంటలు అయినట్లు గుర్తించారు. ఆయనకు గత 15 సంవత్సరాలుగా రక్తపోటు (BP) సమస్య ఉంది. అయితే, నెల రోజులుగా దానికి సంబంధించిన మందులు వాడటం లేదని తెలిసింది.

మూడు రోజులుగా ఆయాసంతో బాధపడుతున్న అందెశ్రీ, ఆదివారం రాత్రి భోజనం చేసి సాధారణంగానే పడుకున్నారు. ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి కిందపడి ఉన్నారని వైద్యులకు తెలిపారు.

Tags:    

Similar News