తెలంగాణ పంచాయతీ ఎన్నికలు: తొలి విడత ఓట్ల లెక్కింపు ప్రారంభం

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల (TG Panchayat Elections 2025) కోసం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

Update: 2025-12-11 09:45 GMT

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు: తొలి విడత ఓట్ల లెక్కింపు ప్రారంభం

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల (TG Panchayat Elections 2025) కోసం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. మధ్యాహ్నం 1 గంటలోపు క్యూలో నిలబడ్డ ఓటర్లందరికీ తమ ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అధికారికంగా కౌంటింగ్ ప్రారంభమైంది.

ఈ విడతలో ఎన్నికల వివరాలు

మొత్తం 3,834 సర్పంచి,

27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

రాష్ట్రవ్యాప్తంగా 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

సర్పంచి ఫలితాలు ప్రకటించిన తర్వాత సంబంధిత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచి ఎన్నికలు చేపడతారు.

తొలి దశ ముఖ్య గణాంకాలు

మొత్తం పంచాయతీలు: 4,236

వార్డు సభ్యుల స్థానాలు: 37,440

ఏకగ్రీవ సర్పంచి పదవులు: 396 + 6

(5 స్థానాలకు నామినేషన్లు లేకపోవడం, 1 స్థానం కోర్టు స్టే)

ఏకగ్రీవ వార్డు సభ్యులు: 9,633 + 179

(169 స్థానాలకు నామినేషన్లు లేకపోవడం, 10 స్థానాలకు కోర్టు స్టే)

తొలి విడత పోలింగ్ శాంతియుతంగా ముగియడంతో, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఫలితాల కోసం రాజకీయ వర్గాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News