Deputy Speaker tests positive for coronavirus: తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా పాజిటివ్

Update: 2020-06-30 06:15 GMT

Telangana Deputy Speaker Padma Rao Goud tests positive for coronavirus : తెలంగాణలోని అన్ని పార్టీలను కరోనా మహమ్మారి వణికిస్తుంది. అధికార ప్రతిపక్షాలని తేడా లేకుండా ప్రధాన పార్టీలను గజగజలాడిస్తుంది. ముఖ‌్యంగా అధికార టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను కోవిడ్ కంగారు పెడుతోంది. ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ‌రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ కోవిడ్‌ బారిన పడగా, తాజాగా తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కూడా ఈ జాబితాలో చేరారు.

తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. మూడు రోజుల నుంచి జ్వరం గొంతునొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. పద్మారావుతోపాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు సైతం కోవిడ్‌ బారిన పడ్డారు. వీరంతా ప్రస్తుతం సికింద్రాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా, నిన్న తెలంగాణలో 975 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 15,394కు చేరగా, మృతుల సంఖ్య 253కు పెరిగింది. వివిధ ఆసుపత్రుల్లో 9,559 మంది చికిత్స పొందుతుండగా, 5,582 మంది కోలుకున్నారు. 

Tags:    

Similar News