తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

CM KCR: శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

Update: 2023-04-30 08:09 GMT

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

CM KCR:  తెలంగాణ నూతన సచివాలయంలో పరిపాలన మొదలైంది. సర్వ హంగులు, సకల సౌకర్యాలతో నిర్మితమైన సెక్రటేరియట్‌ నేటి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్‌లో తన తొలి సంతకంతో పరిపాలనను ప్రారంభించారు.

తెలంగాణ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సెక్రటేరియట్ గేట్‌ దగ్గర పూజ చేసిన సీఎం.. ఆ తర్వాత సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం సచివాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రిబ్బన్ కట్‌ చేసి సచివాలయంలోకి అడుగుపెట్టారు. ఎలక్ట్రిక్ వాహనంలో ఎక్కి సచివాలయంలో తిరిగారు. సచివాలయం లోపల నిర్వహిస్తున్న వాస్తుపూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లో ఆసీనులయ్యారు సీఎం కేసీఆర్‌. పోడు భూముల ఫైల్‌పై తన తొలి సంతకం చేశారు. మొత్తం ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆ తర్వాత తన ఛాంబర్‌‌లో వేద పండితుల నుంచి ఆశీర్వచనం స్వీకరించారు.




సెక్రటేరియట్‌లో ఆసీనులైన సీఎం కేసీఆర్‌కు మంత్రులు, అధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. సీఎంను కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చిన మంత్రులు.. సీఎంకు అభినందనలు తెలిపారు. హరీశ్‌ రావు, మల్లారెడ్డి సహా పలువురు కేసీఆర్‌ పాదాలను తాకి ఆశీర్వచనం తీసుకున్నారు.

సీఎం కేసీఆర్ తర్వాత మంత్రులు కూడా తమ తమ ఛాంబర్లలోకి ప్రవేశించారు. సీఎస్‌ శాంతకుమారి సహా మంత్రులు తమ ఛాంబర్లలో ఆసీనులయ్యారు. వారి శాఖలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు.

Tags:    

Similar News