New Ration Cards: రేషన్ కార్డు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. కొత్త కార్డుల జారీలో..

New Ration Cards: రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం పోకస్ పెట్టింది. తొలి విడతలో లక్ష రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Update: 2025-02-20 06:30 GMT

New Ration Cards: రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం పోకస్ పెట్టింది. తొలి విడతలో లక్ష రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళల పేరుతోనే రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా లబ్దిదారుల ఎంపికకు ఈ ఏడాది జనవరి 26న గ్రామ సభలు నిర్వహించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున కొత్త రేషన్ కార్డుల జారీకి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉగాదికి కొత్త రేషన్ కార్డుదారులతో పాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుదారులకు కూడా సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డులకు సంబంధించిన డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు చూపారు.

ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు తరహాలో డిజైన్ చేశారు. దీనిపై లబ్దిదారుడి వివరాలుంటాయి. క్యూ ఆర్ కోడ్ ను కూడా దీనిపై ఉంచారు. గృహిణి పేరుతోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలా? కుటుంబ సభ్యుల ఫోటో మొత్తం ఉండాలా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కార్డుపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ లోగో ఉండేలా ప్లాన్ చేశారు.

రాష్ట్రంలో 12.07 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తే 6.70 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు.రేషన్ కార్డుల్లో పేర్ల మార్పునకు సంబంధించి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. గతంలో 2016లో ఒకసారి అవకాశం కల్పించారు. ఒక్కో కుటుంబం నుంచి ఒక్కటి నుంచి ముగ్గురు సభ్యుల పేర్లు అందాయి. దీంతో కొత్తగా 1.03 లక్షల మందిని రేషన్ లబ్దిదారులుగా చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News