కోయ, కొండరెడ్డి గిరిజనుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇక్కడి ప్రజలు చాలా రోజులుగా ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను తెలంగాణ ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలోని చింతలపాడు అనే కుగ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ గిరిజనుల దుస్థితి చూసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ వీడియో విడుదల చేసారు. ఇక్కడున్న కోయ, కొండరెడ్డి గిరిజనుల పరిస్థితి దారుణంగా ఉందని , వీరికి రేషన్ కూడా అందడం లేదని గ్రామంలో వాలంటీర్లు కూడా లేరని చెప్పారు. వీరికి న్యాయం చేయాలని కోరారు.
గిరిజన గూడేల్లో సీతక్క తిరుగుతున్నారు. రోడ్డు సదుపాయం లేని ప్రాంతాల్లో కూడా ట్రాక్టర్లలో వెళ్తూ, ముండుటెండల్లో ప్రయాణం చేస్తూ పేదలకు అండగా నిలబడుతున్నారు. ఇదే క్రమంలో ఏపీలోని చింతలపాడుకు కూడా వెళ్లారు. అక్కడి గిరిజనులకు సాయం చేశారు. రాష్ట్రం వేరైనా సీతక్క చేసిన సాయాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తూన్నారు.