Congress: తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
Congress: తెలంగాణలో ఈనెల 29న జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది.
Congress: తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
Congress: తెలంగాణలో ఈనెల 29న జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎమ్మెల్సీలుగా టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, అధికార ప్రతినిధిగా ఉన్న అద్దంకి దయాకర్ పేర్లు ఖరారయ్యాయి. ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం.. సియాసిత్ ఎడిటర్ జాహిద్ అలీఖాన్ పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి అభ్యర్థులపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో 30 నామినేటెడ్ కార్పొరేషన్ పదవులు కూడా కాంగ్రెస్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే సీఎం విదేశీ పర్యటన తర్వాతే నామినేటెడ్ పోస్టులపై ప్రకటన రానుంది.