వరంగల్ పర్యటనలో మంత్రులు కేటీఆర్, ఈటల

Update: 2020-08-18 05:28 GMT
వరంగల్ పర్యటనలో మంత్రులు

వారం రోజులుగా తెలంగాణలో కుండపోతగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీగా కురుస్తున్న వర్షాలకు నగరాల రోడ్లపై వరద నీరు చేరుకుని జనజీవనం స్థంబించిపోయింది. రాష్ట్రంలోని కుంటలు, నదులు, చెరువులు ఎక్కడికక్కడ నిండి పొంగి పొరలుతున్నాయి. ఈ క్రమంలోనే దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై వరద సహాయక చర్యల్ని చేపడుతోంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాను భారీగా కురుస్తున్న వర్షాలు, వరదలు పూర్తిగా ముంచెత్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ వరంగల్‌లో పర్యటించారు. హైదరాబాద్ నగరం నుంచి కేటీఆర్, మంత్రి ఈటలతో కలిసి హెలికాప్టర్‌లో వరంగల్ చేరుకున్నారు. కాగా వరంగల్ జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ లు వారికి స్వాగతం పలికారు.

వారు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ముంపు ప్రాంతాలను స్థానిక మంత్రులతో కలిసి ఏరియల్ సర్వే చేయనున్నారు. అనంతరం ముంపు ప్రాంతాల్లో పర్యటించి తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష చేయనున్నారు. ఇక ఇప్పటికే వరంగల్ నగరంలో ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలం అయింది. వరద పరిస్థితులు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై వరంగల్ నిట్‌లో సమీక్ష నిరవహించనున్నారు. ఇక పోతే వరంగల్‌ నగరాన్ని వరదలు ముంచెత్తిన క్రమంలో అక్కడి పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సోమవారం సమీక్షించారు. నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు చేపట్టిన సహాయకచర్యలపై ఆరాతీశారు.




Tags:    

Similar News