గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక దందా నడిచేది- మంత్రి వివేక్

గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక దందా నడిచేదని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి.

Update: 2025-11-19 07:54 GMT

గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక దందా నడిచేది- మంత్రి వివేక్

గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక దందా నడిచేదని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరులో స్థానిక కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి సాండ్ బజార్‌ను ప్రారంభించారు మంత్రి వివేక్‎. గోదావరి ఇసుక కోసం ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సాండ్ బజార్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.

ఈ సాండ్ బజార్ TGMDC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని, గోదావరి ఇసుక కావలసిన ప్రజలు ఆన్‌లైన్లో బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే వస్తోందని అన్నారు. చెన్నూరు‎లో గోదావరి నది ఉన్న ఇసుక దొరకని పరిస్థితి ఉండడంతో అధికారులతో మాట్లాడి ఈ సాండ్ బజార్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివేక్ తెలిపారు.

Tags:    

Similar News