అలాంటి కుక్కల్లాగా మేం అరవం: మంత్రి తలసాని

తెలంగాణ ప్రభుత్వం పై ప్రతిపక్ష పార్టీలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్పష్టతను ఇచ్చారు.

Update: 2020-03-09 10:45 GMT
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (ఫైల్ ఫోటో)

తెలంగాణ ప్రభుత్వం పై ప్రతిపక్ష పార్టీలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్పష్టతను ఇచ్చారు. ప్రతి సారిలా కాకుండా ఏ సారి ప్రతిపక్ష నేతలపై కాస్త డోస్ పెంచి ఘాటుగా సమాధానం ఇచ్చారు. మా పార్టీనేతలు ప్రతిపక్ష నేతల మాదిరిగా కుక్కల్లా అరవబోమని ఆయన వ్యాఖ్యానించారు. తమకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయని, వాటిని తప్పకుండా నిర్వర్తిస్తామని తెలిపారు.

రాష్ట్రం ఇప్పటికే ఆర్థిక మాంద్యంలో ఉందని అయినప్పటికీ అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆర్థిక రంగ నిపుణులు కూడా స్వాగతించారని ఆయన గుర్తు చేశారు. అన్ని వర్గాల వారికి ఈ బడ్జెట్‌ ద్వారా మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సారి కేటాయించిన బడ్జెట్లో బీసీల ఉన్నతికి తోడ్పడే అంశాలు ఎక్కువగా ఉన్నాయని, సుమారు 7 దశాబ్దాల తర్వాత వారికి న్యాయం జరుగుతుందని హర్షం వ్యక్తం చేసారు.

పేదలకు ఇచ్చే డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని తెలిపారు. డబుల్‌ బెడ్‌రూమ్ ఇల్లు ఎవరు మొదలు పెట్టినా కాస్త సమయం పడుతుందని, మొదలు పెట్టిన రెండు రోజుల్లోనే పూర్తి కావని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 6 నెలలు కృషి చేస్తే ఇంత అద్భుతమైన బడ్జెట్ రూపొందిందని చెప్పారు.

Tags:    

Similar News