KTR: తెలంగాణలో పరిశ్రమలు స్థాపించే మహిళలకు ప్రోత్సాహకాలు

KTR: మహిళల్లో సమర్థత, నవతర ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు

Update: 2022-03-08 08:12 GMT

KTR: తెలంగాణలో పరిశ్రమలు స్థాపించే మహిళలకు ప్రోత్సాహకాలు

KTR: అందుబాటులో ఉన్న టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని సరికొత్త ఆలోచనలతో పారిశ్రామిక ప్రగతి సాధించాలని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ మెడికల్ డివైజ్ పార్కులో ఆయన ఫ్లో ఇండస్ట్రియల్ పార్క్ పైలాన్ ఆవిష్కరించారు. నవయువతరం మహిళలు పారిశ్రామికరంగంలో రాణిస్తున్నారని ఆయన అభినందించారు. పరిశ్రమలు స్థాపించాలనే మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఇతోధికంగా తోడ్పాటును అందిస్తుదన్నారు. నోట్ల మార్పిడి, కరోనా కష్టాల్లోనూ తెలంగాణను ప్రగతి పథంలో నడిపించారని పేర్కొన్నారు. ప్రపంచదేశాలకు వ్యాక్సిన్లను అందించిన ఘనత, దేశీయంగా ఔషధాల ఉత్పత్తికి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోందన్నారు. 

Tags:    

Similar News