KTR has Inaugurated Municipal Building: యువతకు ఉద్యోగాలు వస్తాయి

KTR has Inaugrated Municipal Building: సంక్షోభ సమయంలో కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని అది ప్రభుత్వ ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Update: 2020-06-29 10:45 GMT

KTR has Inaugrated Municipal Building in Huzurnagar: సంక్షోభ సమయంలో కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని అది ప్రభుత్వ ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్డీవో కార్యాలయాన్ని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సహచర మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో హరితహారం మొక్కలు నాటారు. అనంతరం 50 కోట్ల రూపాయలతో పురపాలక సంఘం పరిధిలో నూతనంగా నిర్మించ తలపెట్టిన అర్బన్ పార్క్ నిర్మాణంతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి నెల మున్సిపాలిటీలకు, పంచాయతీలకు నిధులు అందిస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను సుందరీకరణ చేస్తున్నామన్నారు. పాలనను ప్రజల ముంగిటకు తెస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన సంస్కరణలకు తెరలేపారన్నారు. అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్లను, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు డబ్బులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. చిట్ట చివరి మనిషి వరకు ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొంత దెబ్బతిన్నప్పటికీ వేగంగా పుంజుకుందన్నారు.

ఇంత కష్ట కాలంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ 54 లక్షల 22 వేల రైతులకు రూ.7 వేల కోట్లను రైతుబంధు కింద ఆర్థిక చేయూత ఇచ్చారని వెల్లడించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్‌ పనులను త్వరలోనే పూర్తి చేసిన సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను అక్రమిస్తే ఉపేక్షించేది లేదని, వారిపట్ల కఠినంగానే ఉంటామని హెచ్చరించారు. హైదరాబాద్ టు విజయవాడకు హై స్పీడ్ రైలు ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హుజూర్ నగర్ లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు.

యువతకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. పార్టీలకు అతీతంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నదని, ఇప్పుడు ఎన్నికలు ఏమి లేవు. మా ముందున్న లక్ష్యం అభివృద్ధి మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యే సైదిరెడ్డి, మల్లయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, జెడ్‌పీ చైర్‌ పర్సన్‌ దీపికా, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News