ప్రపంచమంతా భారత్‌ను అనుసరిస్తుంది : మంత్రి హరీష్ రావు

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి తనగొప్ప మనసును చాటుకున్నారు.

Update: 2020-04-28 13:24 GMT
Harish Rao (File Photo)

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి తనగొప్ప మనసును చాటుకున్నారు. సిద్దపేటలోని పేదప్రజలకు మంగళవారం బియ్యం, నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం పెట్టిన నిబంధనలను పాటిస్తున్న, ప్రభుత్వానికి సహకరిస్తున్న ప్రజలను ఆయన ప్రశంసించారు. రాత్రనక, పగలనకు ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్న వైద్యులు, పోలీసుల సేవలు అమోఘమని ప్రశంసించారు.

ఇదే విధంగా మరికొన్ని ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. అనవసరంగా బయట తిరిగి కరోనాను అంటించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. నిత్యావసర వస్తువుల కోసం బయటికి వస్తే జాగ్రత్తలు పాటించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచానికి భారతీయ సంస్కృతి విలువ తెలిసిందని ఆయన అన్నారు. ప్రపంచదేశాలన్నీ భరతదేశాన్ని అనుసరిస్తూ షేక్‌ హ్యాండ్‌ వద్దు, నమస్తే చాలంటున్నాయని తెలిపారు. మాకేం కాదులే అనే నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ లాక్ డౌన్ పాటిస్తూ కరోనాను తరిమి కొడదామని ఆయన సూచించారు.  


Tags:    

Similar News