పోలింగ్ బూత్‌లలో సెల్ఫీలు తీసుకుంటే..

Update: 2019-04-09 13:09 GMT

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు తొలిదశలోనే పోలింగ్ ఈ నెల 11న జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నిజామాబాద్‌లో అత్యధికంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ కూడా సజావుగా పోలింగ్ నిర్వహించడానికి చర్యలు చేపట్టారు. ఇక్కడ ఉదయం 6 గంటలనుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ జరగనుంది. ఆ తరువాత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ కొనసాగిస్తారు. మిగతా చోట్ల సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ ఉంటుంది.

అత్యంత సమస్యాత్మకంగా ఉన్న 4 వేల 169 బూత్‌లలో లైవ్ వెబ్ కాస్టింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. ఇక నిజామాబాద్‌లో ప్రత్యేకంగా ఐపీ కెమెరాలు వినియోగిస్తున్నట్లు సీఈఓ రజత్ కుమార్ తెలిపారు. అలాగే ఓటు వేసిన ఓటర్లు పోలింగ్ బూతులతో సెల్ఫీలు తీసుకోకూడదని హెచ్చరించింది ఈసీ. తెలంగాణలో మొత్తం 2 కోట్ల 97 లక్షల 8 వేలకుపైగా ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు కోటి 49 లక్షల 30 వేల మంది ఉంటే… మహిళా ఓటర్ల సంఖ్య కోటి 47 లక్షల 76 వేలు. ఇక థర్డ్ జెండర్ ఓట్లు ఒకవేయి 504, సర్వీస్ ఓట్లు 11 వేల 320, ఎన్నారై ఓట్లు ఒక వేయి 731. ఎన్నికల కోసం మొత్తం 34 వేల 604 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు.

Similar News