Telangana Local Body Elections: గుర్రంపై వచ్చి.. నామినేషన్ వేసి..
Telangana Local Body Elections: తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల జోష్ కనిపిస్తోంది. సర్పంచ్, వార్డు మెంబర్ పదవుల కోసం పోటా పోటీ నెలకొంది.
Telangana Local Body Elections: గుర్రంపై వచ్చి.. నామినేషన్ వేసి..
Telangana Local Body Elections: తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల జోష్ కనిపిస్తోంది. సర్పంచ్, వార్డు మెంబర్ పదవుల కోసం పోటా పోటీ నెలకొంది. సార్వత్రిక ఎన్నికలను మరిపించేలా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం తాడ్మన్మూర్ లో ఓ అభ్యర్థి వినూత్న రీతిలో నామినేషన్ కార్యక్రమానికి తరిలివెళ్లారు.
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పటోళ్ల వీరారెడ్డి గుర్రంపై తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్కోసం రెండు గుర్రాలకు 20వేలు వెచ్చించి తీసుకువచ్చారు. తాడ్మన్మూర్ గ్రామం నుంచి అక్సాన్‌పల్లి క్లస్టర్ వరకు డప్పుల చప్పళ్లతో వందలాది కార్యకర్తలతో వచ్చి నామినేషన్ సమర్పించారు.