New Year: మందుబాబులకు కిక్కెక్కించే వార్త..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
New Year: మందుబాబులకు కిక్కెక్కించే వార్త..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
New Year: పండగల సమయంలో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ప్రకటిస్తుంటాయి ప్రభుత్వాలు. ఈ సమయంలో మద్యం కోసం ఇబ్బందులు పడుతుంటారు మందుబాబులు. ఏవైనా వైన్ షాపులు ఓపెన్ ఉందేమో అంటూ ఊరంతా తిరుగుతుంటారు. రహస్యంగా తెరిచినా ఆ షాపుల్లో ధరలు భారీగా ఉంటాయి. మద్యం ప్రియులు ధర ఎక్కువైనా సరే కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరం వేడుకలకు కీలక నిర్ణయం తీసుకుంది.
డిసెంబర్ 31నాడు తెలంగాణలో మద్యం షాపులను అర్థరాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచవచ్చని ప్రభుత్వం పేర్కొంది. న్యూఇయర్ లిక్కర్ పార్టీతో వెల్కమ్ చెప్పాలనుకునేవారికి మద్యం దొరకదనే సమస్య తీరినట్లే. ఇక అర్ధరాత్రి మద్యం ఫుల్ డిమాండ్ ఏర్పడనుంది. తెలంగాణ ప్రభుత్వం బార్లు రెస్టారెంట్లను అర్ధరాత్రి 1 గంట వరకు తెరచి ఉండవచ్చని తెలిపింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈవెంట్లను రాత్రి 1 గంట వరకు జరుపుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. స్వయంగా జీవో ను జారీ చేసింది.
అయితే ప్రభుత్వం ప్రజలకు అనుకూల నిర్ణయం తీసుకుంటుంటే ..మరోవైపు కొత్త సంవత్సరం వేల భారీగా డ్రగ్స్ అమ్మేందుకు అక్రమార్కులు రెడీ అవుతున్నట్లు పక్కా సమాచారం పోలీసులు పకడ్బందీ ప్లాన్ లో ఉన్నారు. ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, వాడినా, దగ్గర ఉంచుకున్నా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండగను బాగా జరుపుకోవాలనీ, డ్రగ్స్ మత్తులో పడకూడదని సూచించారు.