తెలంగాణ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం
మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటాలో 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జూడాలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటాలో 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జూడాలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్థానిక డాక్టర్లకు పీజీ సీట్లు పొందే అవకాశాలు పెరుగుతాయని జూనియర్ డాక్టర్లు అన్నారు. దీంతో రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య కూడ పెరుగుతుందని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.