Telangana HC notice over Online Classes: ఆన్‌లైన్‌ క్లాస్‌లపై యూనిఫామ్‌ పాలసీ తీసుకు రావాలి : తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు

Telangana HC notice over Online Classes: కరోనా నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభం కాకున్నా ప్రైవేటు పాఠశాలలు అడ్డగోలు ఫీజులు చెల్లించాలని తమపై ఒత్తిడి తెస్తున్నాయని, ప్రైవేటు స్కూళ్ల దోపిడిని అరికట్టాలంటూ పేరెంట్స్‌ అసోసియేషన్‌ హైకోర్టును ఆశ్రయించింది.

Update: 2020-07-01 12:00 GMT

Telangana HC notice over Online Classes: కరోనా నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభం కాకున్నా ప్రైవేటు పాఠశాలలు అడ్డగోలు ఫీజులు చెల్లించాలని తమపై ఒత్తిడి తెస్తున్నాయని, ప్రైవేటు స్కూళ్ల దోపిడిని అరికట్టాలంటూ పేరెంట్స్‌ అసోసియేషన్‌ హైకోర్టును ఆశ్రయించింది. కాగా ఈ పిటిషన్ పై బుధవారం హై కోర్టు విచారణ జరిపింది. ఈ విచారణంలో ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని పేరెంట్స్‌ అసోసియేషన్‌ హైకోర్టుకు వివరించింది. అంతే కాకుండా జీవో 46ను ఉల్లంఘించి ఫీజులు వసూలు చేస్తున్నారని కోర్టుకు తెలిపింది. వీటికి సంబంధించి స్కూళ్లు పంపించిన సందేశాలను, వాయిస్‌లను ఆధారాలుగా పేరెంట్స్ అసోసియేషన్ కోర్టుకు చూపించింది. దీంతో స్పందించిన కోర్టు ఆన్‌లైన్‌ క్లాస్‌ల నిర్వాహణపై ప్రభుత్వం ఏమైనా సర్క్యూలర్‌ జారీ చేసిందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఆన్‌లైన్‌ క్లాస్‌లపై యూనిఫామ్‌ పాలసీ తీసుకు రావాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు అన్‌లైన్‌ క్లాస్‌లపై ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తున్నారే విషయం కోర్టుకు తెలియజేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్‌ క్లాస్‌లపై ఎలాంటి నిర్ణయం తీసుకుందని హైకోర్టు ప్రశ్నించగా, జిల్లా విద్యాశాఖ అధికారులు దీనిపై పరిశీలిస్తున్నారని అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. హర్యానా రాష్ట్రంలో ఇప్పటికే ఆన్‌లైన్‌ క్లాస్‌లను నిషేధించారని పేర్కొన్న హైకోర్టు.. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో విద్యార్థులపై ఒత్తిడి తీసుకు రావద్దని ప్రభుత్వాలు స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చారని వెల్లడించింది. ఆన్‌లైన్‌ క్లాస్‌లు ఉంటాయా.. ఉండవా అన్న ప్రభుత్వ నిర్ణయం కోర్టుకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది.

Tags:    

Similar News