గ్రేటర్‌లో వరదసాయంపై హైకోర్టులో నేడు విచారణ

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా వరదసాయం నిలిపివేయడంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. వరదసాయం కొనసాగించే విధంగా ఆదేశాలివ్వాలని స్పెషల్ జీపీ శరత్‌ పిల్ దాఖలు చేశారు.

Update: 2020-11-24 02:33 GMT

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా వరదసాయం నిలిపివేయడంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. వరదసాయం కొనసాగించే విధంగా ఆదేశాలివ్వాలని స్పెషల్ జీపీ శరత్‌ పిల్ దాఖలు చేశారు. విపత్కర పరిస్థితుల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తించదని ఆయన కోర్టుకు తెలిపారు. మరోవైపు ఎన్నికల సమయంలో డబ్బులు ఇవ్వడం వలన ఓటర్లపై ప్రభావం పడుతుందని ఈసీ తరపు న్యాయవాది విద్యాసాగర్ వాదించారు. వాదనలు, ప్రతివాదనలు విన్న ధర్మాసనం.. వరదసాయంపై విధి విధానాలు తెలపాలని ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. అటు గ్రేటర్ ఎన్నికల తరవాత వరద సహాయాన్ని కొనసాగిస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 01న గ్రేటర్ ఎన్నికలకి పోలింగ్ జరగనుండగా, 04న ఫలితాలు రానున్నాయి.

Tags:    

Similar News