TG High Court: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును అరెస్ట్ చేయవద్దు
Phone Tapping Case: హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది.
TG High Court: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును అరెస్ట్ చేయవద్దు
Phone Tapping Case: హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని ఆయనను ఆదేశించింది.పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు డిసెంబర్ 3న ఆయనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని ఆయన పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.ఈ విషయంలో హరీష్ రావుతో పాటు అప్పట్లో ఇంటలిజెన్స్ లో పనిచేసిన రాధాకిషన్ రావుపై ఆయన ఆరోపణలు చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను ఆయన పోలీసులకు అందించారు. ఐ ఫోన్ నుంచి తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్టు వచ్చిన ఆధారాలను కూడా ఆయన పోలీసులకు అందించారు.పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసుపై హైకోర్టులో హరీష్ రావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఆయనను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఇవాళ ఆదేశించింది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తన ఫోన్లను ట్యాపింగ్ చేసిందని అప్పట్లో రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో అప్పట్లో ఎస్ఐబీలో ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావుపై ఆరోపణలున్నాయి. ఆయన అమెరికాలో ఉన్నారు. ఆయనను ఇండియాకు రప్పించేందుకు ప్రభుత్వం ఇంటర్ పోల్ ను ఆశ్రయించింది.