హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్ పై స్టే: రేవంత్ సర్కార్ కు తెలంగాణ హైకోర్టు షాక్

హకీంపేటలో భూ సేకరణను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. భూసేకరణ నోటిఫికేషన్ ను కొట్టివేసింది.

Update: 2025-03-06 08:00 GMT

లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ కొట్టివేత: రేవంత్ సర్కార్ కు తెలంగాణ హైకోర్టు షాక్

హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భూసేకరణను రద్దు చేయాలని ఆయన కోరారు. నోటిఫికేషన్ రద్దు చేసేవరకు స్టే విధించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్ధించారు. 2024 నవంబర్ 29న భూసేకరణపై నోటిఫికేషన్ జారీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్. ఇండస్ట్రీయల్ పార్క్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇందులో భాగంగా హకీంపేటలో 351 ఎకరాలను సేకరించనున్నారు. ఈ భూసేకరణను పిటిషనర్ వ్యతిరేకించారు. 2013 భూసేకరణ చట్టం మేరకు చెల్లించడం లేదని పిటిషనర్ వాదించారు.

కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా ఇండస్ట్రీస్ కోసం ప్రభుత్వం 2024 జూన్ 7న నోటిఫికేషన్ జారీ చేసింది. లగచర్ల, హకీంపేట, పోలేపల్లిలో 1358 ఎకరాల భూసేకరించాలని తలపెట్టారు. పట్టా, అసైన్డ్ భూములను సేకరించాలని అప్పట్లో ప్రభుత్వం భావించింది. పోలేపల్లిలో 71 ఎకరాలు, లగచర్లలో 632 ఎకరాలను భూసేకరణకు అప్పట్లో అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే భూసేకరణను స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక్కడ ఎక్కువగా ఉండేది గిరిజన రైతులే. ఫార్మా విలేజీకి భూములు ఇవ్వడానికి రైతులు ముందుకు రాలేదు. అయితే అదే సమయంలో భూసేకరణపై ప్రజాభిప్రాయానికి వచ్చే అధికారులపై ప్రజలు తిరగబడ్డారు.

2024 నవంబర్ లో లగచర్లలో ప్రజాభిప్రాయసేకరణకు వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు ఇతర అధికారులపై దాడికి యత్నించారు. ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని అధికార కాంగ్రెస్ ఆరోపించింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. లగచర్లలో కలెక్టర్ పై దాడికి ఘటన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ ఫార్మా విలేజ్ ఏర్పాటు ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది.

ఈ ప్రాంతంలో మల్టీపర్సస్ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫార్మా విలేజ్ కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్ బదులుగా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది.

Tags:    

Similar News