Telangana MLC Elections: బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుందా..? కొత్త ప్లాన్ ఏంటి?

Telangana MLC Elections: ఏకంగా పార్టీ కార్యాలయంలో వన్ టూ వన్.. ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు రాబోతున్నాయన్న దానిపై ఆరా తీసిన అధిష్టానం.

Update: 2021-03-12 02:14 GMT

బీజేపీ జెండా(ఫైల్ ఫోటో)

Telangana MLC Elections:తెలంగాణలో ఓ జాతీయ పార్టీ ఎన్నికల వ్యూహాల కోసం కీలకవర్గాన్ని రంగంలో దింపిందా? సాధారణంగా ఎప్పుడూ పార్టీ ఆఫీసుకు రాకుండా బయట నుంచే పర్యవేక్షించే వ్యూహకర్తలు పెడుతున్న మీటింగ్‌లను ఎలా చూడాలి? పట్టభద్రుల ఎన్నికలను ఆ జాతీయ పార్టీ అంత ప్రిస్టిజియస్‌గా తీసుకుందా? ఇంతకీ ఏంటా పార్టీ? ఎవరా స్ట్రాటజిస్టులు?

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు లేనంతగా ఈసారి పట్టభద్రుల ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. తెలంగాణలో ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండడంతో ఈ ఫలితాలు భవిష్యత్తు రాజకీయాలను ప్రభావితం చేస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికలపై భారీ అంచనాలు పెట్టుకుందన్న చర్చ నడుస్తోంది. పార్టీతో పాటు... పార్టీ అనుబంధ సంఘాలను అందుకే రంగంలోకి దింపుతూ తిరిగి పట్టు సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు కనిపిస్తోంది.

ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో... కీలక సమావేశం జరిగిన్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ఈ సమావేశంలో సంఘం కీలక నేతలు హాజరై ఆరు జిల్లాల్లో ఉన్న పరిస్థితిని ఆరా తీసిన్నట్లు తెలుస్తోంది. ఎప్పడు ఎన్నికలు జరిగినా.. కేవలం గ్రౌండ్ స్థాయిలో పనిచేస్తూ.. పరిస్థితిని అంచానా వేసే సంఘం నేతలు ఏకంగా పార్టీ కార్యాలయంలో వన్ టూ వన్ సమావేశం నిర్వహించినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. గ్రామ స్థాయి నుంచి పట్టణంలో పరిస్థితిని అధ్యయనం చేసి ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు రాబోతున్నాయో ఆరా తీసినట్టు తెలుస్తోంది. పార్టీ అభ్యర్థులపై భారీగా అంచనాలు పెరగడం వల్లనే.. సంఘం ముఖ్యనేతలు రంగంలో దిగారనే చర్చ కమలం పార్టీలో నడుస్తోంది.

ఎప్పడూ తెరవెనుక ఉండే నేతలు... కీలక సమయంలో సంఘం నేతలు రంగంలో దిగడంతో... పార్టీలో ఏదో జరుగుతుందనే చర్చ సాగుతోంది. ఆర్ఎస్ఎస్ నేత శ్రీధర్‌జీతో పాటు మరో ముగ్గురు నేతలు వేదికపై కూర్చొని లెక్కలు వేయడంతో... కీలక సమయంలో రంగంలో సంఘం నేతలు దిగారని చెప్పుకుంటున్నారు. గతంలో ఇలాంటి ఎన్నికలను లైట్ తీసుకునే సంఘం నేతలు... ఈసారి రెండూ గెలుస్తే... ఇక తెలంగాణ మొత్తం పాగా వేయవచ్చన్నది సంఘం నేతలు వ్యూహమని కమలం కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. అందుకే సంఘం నేతలు వ్యూహాాత్మకంగా పార్టీ నేతలపై మరింత వత్తిడి పెంచడానికి రంగంలో దిగారని చెప్పుకుంటున్నారు. మరి సంఘం నేతలు రంగప్రవేశం బీజేపీ అభ్యర్థులకు ఏ మేరకు కలసి వస్తుందో చూడాలి.


Tags:    

Similar News