Graduate MLC Elections: కోనసాగుతున్న పోలింగ్..ఇప్పటి వరకు 21 శాతం నమోదు

Graduate MLC Elections: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కోనసాగుతుంది.

Update: 2021-03-14 08:08 GMT

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ  ఎన్నికల పోలింగ్

Graduates' MLC Elections: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కోనసాగుతుంది. ఈ ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. నెల్లికుదురులో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిపై టిఆర్ఎస్ కార్యకర్తల దాడి పాల్పడ్డారు. పోలింగ్ బూత్‌లను పరిశీలిస్తున్న ప్రేమేందర్ రెడ్డి, హుస్సేన్ నాయక్‌పై దాడి చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుంది. రంగంలోకి దిగిన పోలీసులుఅక్కడకు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఇక మధ్యాహ్నం 12 గంటల వరకు 21.77%  పోలింగ్ శాతం నమోదైందిం. జిల్లాల వారిగా చూస్తే ఇలా ఉంది. హైదరాబాద్‌లో 19.57, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 22.67, రంగారెడ్డిలో 17.16, నాగర్‌కర్నూల్‌లో 21.29, నారాయణ్‌పేట్‌ జిల్లాలో 18.26, వికారాబాద్ జిల్లాలో 25.09, మేడ్చల్‌ జిల్లాలో 20.47, గద్వాల జిల్లాలో 26.36, వనపర్తి జిల్లాలో 28.83 శాతాల పోలింగ్‌ నమోదైంది. 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఉదయాన్నే షేక్‌పేట్‌లోని పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉప్పరపల్లిలో ఎమ్మెల్సీ ఓటు వేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి దంపతులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి మహమూద్‌ అలీ మలక్‌పేట్‌లో ఓటు వేశారు.

Tags:    

Similar News