Graduate MLC Elections: నేడే‌ కౌంటింగ్..తుది ఫలితాలకు 2 రోజులు‌

Graduate MLC Elections: ఉత్కంఠగా సాగిన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు అంతా సిద్ధమైంది.

Update: 2021-03-17 02:05 GMT

తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎంమ్మెల్సీ కౌంటింగ్ 

Graduate MLC Elections: ఉత్కంఠగా సాగిన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు అంతా సిద్ధమైంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిడ్డంగుల సంస్థలో బ్యాలెట్ బాక్స్‌ల్లో ప్రజా తీర్పు భద్రంగా ఉంది. అసలే 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరీ కౌంటింగ్‌ ఎలా చేస్తారు. అధికారుల ప్లాన్ ఏంటి.?

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారం జరిగే కౌంటింగ్ కోసం 8హాళ్లను ఏర్పాటు చేశారు. గదికి 7టేబుళ్ల చొప్పున 56 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. 731 పోలింగ్ స్టేషన్ల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను వరుస క్రమంలో టేబుల్‌కు ఒకటి చొప్పున ఓపెన్ చేస్తారు. బ్యాలెట్ పేపర్లను టేబుల్‌పై కుప్పగా పోసి 25పేపర్లను ఒక్క బండిల్‌గా చుడతారు. ఎప్పటికప్పడు వీటిని తీసుకెళ్లి ఓ డ్రమ్ములో వేస్తారు. ఈ బండిల్ కార్యక్రమానికే 12 గంటల సమయం పడుతుందని అంచనా..

బండిల్ కార్యక్రమం పూర్తయ్యాక.. అసలు లెక్కింపు మొదలవుతుంది. బుధవారం రాత్రి ఎనిమిది తర్వాతే మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కించే పరిస్థితి ఉంది. ఒక్కో టేబుల్‌కు 40 బండిల్స్ చొప్పున ఇస్తూ వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. ఇలా మొత్తం 56 టేబుళ్లపై ఒక్కో రౌండ్‌లో 56వేల ఓట్ల లెక్కింపును చేపడతారు.

మొత్తం 7 రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఫలితాలు పూర్తిగా వెల్లడికానున్నాయి. ఒక్కో రౌండ్‌కు గంట నుంచి గంటన్నర సమయం చొప్పున మొత్తం తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 6గంటల వరకు పూర్తయ్యే అవకాశముంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే చెల్లని ఓట్లను వేరుచేసి చెల్లిన ఓటునుంచే గెలుపు కోటను ఫైనల్ చేస్తారు. మొదటి ప్రాధాన్యతతో గెలుపు కోటా ఎవరికి రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియతో రెండో ప్రాధాన్యత క్రమం ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఎలిమినేషన్ పద్ధతిలో చివరి నుంచి ఇద్దరు మిగిలే వరకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లను కలిపిన తర్వాత కూడా విజేత ఎవరో తేలని పక్షంలో మూడో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి చివరకు ఇద్దరు మిగిలే వరకు విజేతలు వచ్చేలా లెక్కిస్తారు. ఆయా అభ్యర్థులకు వచ్చిన తృతీయ ప్రాధాన్యత ఓట్లను ముందుగా జత చేసిన మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లకు కలిపుతారు. ఇక్కడ మొత్తం ఓట్లలో సగానికి కంటే ఒక ఓటు ఎవరికి వస్తుందో ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.

Tags:    

Similar News