Telangana: ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారం
Graduate MLC Elections 2024: ఉమ్మడి నల్గొండ- ఖమ్మం- వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది.
Telangana: ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారం
Graduate MLC Elections 2024: ఉమ్మడి నల్గొండ- ఖమ్మం- వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన ప్రచారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది.. పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు జిల్లాల్లో మొత్తం 600 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ కుమార్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు.