Supreme Court: గణేశ్ నిమజ్జనాలపై సుప్రీం కోర్టుకు తెలంగాణ, రేపే తీర్పు
Supreme Court: *పీఓపీ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదన్న హై కోర్ట్ *ఈ ఒక్క సారికి అనుమతించమన్నా కుదరదన్న హై కోర్ట్
గణేశ్ నిమజ్జనాలపై సుప్రీం కోర్టుకు తెలంగాణ, రేపే తీర్పు
Supreme Court: హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సాగర్ లో పీఓపి విగ్రహాల నిమజ్జనం కుదరదని హైకోర్ట్ స్పష్టం చేసిన నేపధ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని రేపు తీర్పు రావొచ్చని తలసాని అన్నారు. తనను కలసిన భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులకు ఈ మేరకు భరోసా ఇచ్చారు. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలు, శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తామన్నారు. గణేశ్ శోభా యాత్రకు లక్షల్లో భక్తులు పాల్గొంటారని తలసాని అన్నారు.