Tsrtc Strike : ఆర్టీసీ బకాయిలపై అఫిడవిట్ సిద్ధం

ఆర్టీసీ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకు పోయిందని తెలంగాణ ప్రభుత్వం అంటోంది.

Update: 2019-11-10 16:11 GMT

ఆర్టీసీ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకు పోయిందని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. రేపు హై కోర్టుకు సమర్పించాల్సిన అఫిడవిట్లు ఆర్టీసీ బకాయిలపై ఒక అఫిడవిట్ నే సిద్ధం చేసింది. దాని ప్రకారం ఈనెల 8 వరకూ ఆర్టీసీకి మొత్తం 2,209 కోట్లు బకాయిలున్నాయని తేల్చింది.వీటిలో పీఎఫ్ బకాయిలు 788 కోట్లు, కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బకాయిలు 500 కోట్లు, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ బకాయిలు 180 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ సెటిల్మెంట్ల బకాయిలు 52 కోట్లు ఉన్నాయని పేర్కొంది. ఇక మోటారు వెహికల్ యాక్టు కు 452 కోట్లు, హెచ్ఎస్ డి ఆయిల్ బిల్స్ 34 కోట్లు, హెచ్ఓ రీజియన్, జోన్ బకాయిలన్నీ కలిపి 36కోట్లు ఉన్నాయని లెక్క చూపింది. ప్రైవేటు బస్సుల సంస్థల బకాయిలు 25 కోట్లుకాగా, ఆర్టీసీ బస్సు మరమ్మత్తుల బకాయిలు 60 లక్షలని ప్రభుత్వం తమ అఫిడవిట్ లో తెలియ చేసింది.

Tags:    

Similar News