TS Inter Exams: ఫస్టీయర్ మార్కుల ఆధారంగా సెకండీయర్ ఫలితాలు!

Inter Exams: తెలంగాణలో ఇంటర్‌ సెకండీయర్ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2021-06-09 14:30 GMT

విద్యార్థులు (ఫొటో ట్విట్టర్)

Inter Exams: తెలంగాణలో ఇంటర్‌ సెకండీయర్ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ నేపథ్యంలో ఇప్పటికే ఫస్టీయర్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సెకండీయర్ పరీక్షలను కూడా రద్దు చేసింది. ఇంటర్‌ పరీక్షలపై మంగళవారం కేబినెట్‌ మీటింగ్‌లో చర్చ జరిగింది. అయితే పరీక్షలపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. బుధవారం సాయంత్రం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు.

ఫస్టీయర్ మార్కుల ఆధారంగా సెకండీయర్ ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. మార్కుల కేటాయింపుపై త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తామని ఆమె పేర్కొన్నారు. కమిటీ నిర్ణయం ఆధారంగా ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తామన్నారు. కొవిడ్ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంటర్ పరీక్షల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. పరీక్షలు రాయాలనుకునే వారు కరోనా పరిస్థితులు చక్కబడ్డాక రాయొచ్చని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News