Gangula Kamalakar: ఇకపై బీసీ విద్యార్ధులకూ పూర్తి ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుంది
Gangula Kamalakar: 2023-24 విద్యా సంవత్సరం నుంచే ఫీజు అమలు చేస్తాం
Gangula Kamalakar: ఇకపై బీసీ విద్యార్ధులకూ పూర్తి ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుంది
Gangula Kamalakar: తెలంగాణలో బీసీ విద్యార్ధులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై బీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరం నుంచే ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంతోపాటు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించిన రాష్ట్ర బీసీ విద్యార్ధులందరికీ ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలు అవుతుందని మంత్రి గంగుల తెలిపారు.